స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పల్లెల అవస్థలు

నల్లగొండ జిల్లా: గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం గడువు ముగియడం,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమడంతో పల్లెలో ప్రత్యేక అధికారుల పాలనఅమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.అందులో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు గాను 10 మంది మండల స్థాయి, కొంతమంది గెజిటెడ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది.

 Rural Conditions Under The Rule Of Special Officers, Rural Conditions , Rule Of-TeluguStop.com

వీరు ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ నిరంతరం గ్రామాలను సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలను నిర్వహించి వాటిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామంలో చేపట్టవల్సిన పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవడం,

ప్రజా సమస్యలపై గతంలో చేసిన పనులపై సమీక్షించడం చేయాలి.

కానీ, ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామసభలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు తొలగింపు,వీధిలైట్ల మరమ్మతు,నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని,వర్షా కాలం కావడంలో చెత్తా చెదారం పేరుకుపోయి పల్లెలన్నీ అస్తవ్యస్తంగా తయారై,ప్రజలు రోగాల బారిన పడుతున్నారని,కనీసం ప్రత్యేక అధికారులు పల్లెల వైపు కన్నెత్తి కూడా చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పల్లెల్లో పాలనపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube