నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారదా...?

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది వైఖరిపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి,ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని ప్రభుత్వాలు చెబుతుంటే ఇక్కడ మాత్రం జవాబుదారీ తనం లేని నిర్లక్ష్య ధోరణితో వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది.

 Nalgonda District Central Government Hospital Has Not Changed, Nalgonda District-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…గురువారం రాత్రి నిండు గర్భిణీ కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన ఘటన తెలిసిందే.ఆ అమానవీయ సంఘటన మరవక ముందే మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు కారణం కూడా కుర్చీలో డెలివరీ అయిన సంఘటనే కావడం గమనార్హం.కుర్చీలో డెలివరీ అయిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రిని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర బాధ్యులైన వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో శుక్ర,శనివారాలు విధులను బహిష్కరించి పేషంట్లను పట్టించుకోకుండా వైద్య సిబ్బంది ఆందోళన బాట పట్టారు.

ఈ సమయంలో శనివారం మాడ్గులపల్లి మండలం గ్యారకుంటపాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత డెలివరీ కోసం వచ్చింది.ఎంతసేపు ఉన్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు శ్రీలత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.

దీనితో మరో సమస్య అవుతుందేమోనని భావించిన డ్యూటీ డాక్టర్ బయటికి పోతున్న వారిని మందలించి ఆపరేషన్ చేస్తామని నమ్మబలికి,కోపంతో గర్భిణీకి బలవంతంగా ఆపరేషన్చే యడంతో పండంటి శిశువు మృతి చెందింది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వైద్యుల తీరుపై మండిపడ్డారు.

తాము భయపడినట్టే అయిందని,కోపంతో ఆపరేషన్ చేసి శిశువును చంపారని ఆరోపించారు.

వైద్యో నారాయణో హరిః అంటారు.

కానీ,ఇలా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల,సిబ్బంది తీరుపై,జరుగుతున్న వరుస ఘటనలపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా దృష్టి సారించి,ఇలాంటి ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube