నల్లగొండ జిల్లా:ప్రస్తుతం మెడికల్ మార్కెట్ లో అన్ని నొప్పులకు,జ్వరానికి సర్వరోగ నివారిణిలా అందుబాటులో ఉన్న పారా సెటమాల్ ట్యాబ్లేట్ పై ప్రజలు పరేషాన్ అవుతున్నారు.జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ పారా సెటమాల్ వైపే చూస్తున్నారు.
అయితే ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం చూసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఆందోళనలో పడ్డారు.వర్షాకాల సీజన్లో టైఫాయిడ్,డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా వంటి విషజ్వరాలు విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో కాళ్ల,కీళ్ల నొప్పులతో ప్రజలు నెలల తరబడి బాధ పడుతూ ఉన్నారు.
నొప్పులు భరించలేక పారా సెటమాల్,పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు విపరీతంగా వాడుతున్నారు.ఇవి విపరీతంగా వాడితే కిడ్నీస్ ఫెయిలయ్యే ప్రమాదం ఉందని,ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయోమోనని భయంతో వణికిపోతున్నారు.
ఆ టాబ్లెట్స్ మానేస్తే నొప్పుల బాధ భరించలేకుండా ఉందని,వాడితే ప్రమాదమని చెబుతున్నారని,ఈ బాధ నుండి ఎలా బయట పడాలని వాపోతున్నారు.ప్రభుత్వం ఈ విషజ్వరాల నుండి విముక్తి కలిగించే మార్గం చూడాలని కోరుతున్నారు.