భర్త హత్యకు భార్య అక్రమ సంబంధమే కారణమా...?

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఏఆర్ నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం సంచలనం కలిగించింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…ఏఆర్ నగర్ కాలనీకి చెందిన ఓర్సు వెంకన్న,మైసమ్మ దంపతుల మధ్య గత కొంత కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి.

 Is Wife Illicit Relationship The Reason For Husbands Murder, Wife, Illicit Relat-TeluguStop.com

దానికి కారణం వెంకన్న భార్య మైసమ్మ కొంత కాలంగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్తకు అనుమానం రావడమేనని తెలుస్తుంది.

అక్రమ సంబంధం విషయం భర్త వెంకన్నకి తెలిసిన దగ్గర నుండి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి భర్తను చంపినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు పరిస్థితి పరిశీలించి,కేసు నమోదు చేసి,భార్యను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube