నల్లగొండ జిల్లా:ఎన్ని ఆంక్షలు విధించినా,ముందస్తు అరెస్టులు చేసిన మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరసన తప్పలేదు.మునుగోడులో ముఖ్యమంత్రి ప్రజా దీవెన పేరుతో ఏర్పాటు చేసిన సభకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన ఎదురు కాకుండా శుక్రవారం అర్ధరాత్రి నుండే వివిధ ప్రజా సంఘాల నేతలు,విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేసినా నిరసన సెగ మాత్రం తప్పలేదు.
ఎస్.యు నాయకులను ఎంత మందిని అరెస్ట్ చేసినా,ఎన్ని నిర్బంధాలు విధించినా ముఖ్యమంత్రి కేసీఆర్ కి నిరసన తెలిపి తీరారు.ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు,100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయికి ప్ల కార్డ్స్ తో నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ యూనియన్ (టి.ఎస్.యు) రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు శివగౌడ్,మునుగోడు మండల అధ్యక్షుడు గోలి ప్రవీణ్,నాయణపూర్ మండల అధ్యక్షుడు మాచర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.