సాగర్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగుతూ కాలువలో పడ్డ యువతి

నల్లగొండ జిల్లా:సెల్పీ( Selfie ) మంచిదే కానీ,ప్రాణం పోతే ఎట్లా అనేది ఆలోచన చేయకపోవడమే విచారకరమని అంటున్నారు.ఇలాంటి ఘటనే శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది.

 A Young Woman Fell Into The Canal While Taking A Selfie At Sagar Canal ,sagar Ca-TeluguStop.com

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…ఉదయం హైదరాబాద్( Hyderabad నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగి సెల్ఫీ దిగుతుండగా ఓ యువతి కాలుజారి కాలువలో పడి,నీటి ఉధృతికి కొట్టుకుపోతుంది.

అటుగా వెళుతున్న గాజులాపురం గ్రామానికి చెందిన యువకులు కాలువలోకి దూకి తాళ్ల సహాయంతో మహిళను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు.

దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఆమెను ప్రాణాలతో బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన యువకులను పలువురు అభినందించారు.

ఏం సెల్పీనో ఏమో.ఎన్ని ప్రమాదాలు జరిగినా,ఎన్ని ప్రాణాలు పోయినా సెల్పీపై మోజు మాత్రం పోవడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube