నకిలీ విత్తనాలపై ఉత్తుత్తి దాడులు వద్దు,ఉగ్రరూపం చూపండి.నకిలీ విత్తనాలతో మోసపోతున్న అన్నదాతలకు అండగా నిలవండి.
తెలుగు నేలను నకిలీ విత్తన రహిత రాష్ట్రాలుగా మార్చండి.ఏటా తప్పని విత్తన విషాదం నుండి రైతాంగానికి విముక్తి కల్పించండి.
రైతులకు నాసిరకం విత్తనాలు అమ్ముతున్న వ్యాపారుల ఆస్తులను,ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పంచండి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,వైఎస్ జగన్ లకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్న లేఖ.
నల్లగొండ జిల్లా:నకిలీ విత్తనాల బెడద తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కలవర పరుస్తుందని అసలేదో, నకిలీ ఏదో తెలియని అయోమయ స్థితిలో రైతన్నలు విత్తనాలు కొనుగోలు చేస్తున్న తీరు దయనీయంగా ఉందని సీపీఐ(ఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ప్రజాబంధు అవార్డు గ్రహీత,ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.నాసిరకం,నకిలీ విత్తనాలతో రైతుల జీవితాలు చిత్తవుతున్నాయని,ఏటా తప్పని విషాదం నుంచి ఈ ఏటనైనా రైతులకు విముక్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు విప్లవ నేతాజీ బోరన్న రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయశాఖ నిబంధనలను నీరుగార్చి పత్తి, మిరప విత్తనాలను రైతులకు అమ్ముతున్నారని, తెలంగాణ,ఆంధ్ర పల్లెల్లో ఈ నకిలీ విత్తన ముఠాలు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నాయని పేర్కొన్నారు.కర్ణాటక,మహారాష్ట్ర విత్తన దొంగలకు తోడైన తెలంగాణ,ఆంధ్ర విత్తన వ్యాపార దొంగలు తెలుగు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని అన్నారు.
పత్తి,మిర్చి రైతులను నకిలీ భూతం వెంటాడుతోందని,పోలీసులకు దొరకకుండా చేలల్లో ఇతర రహస్య ప్రదేశాలలో డంప్ చేసి నిలువ చేస్తున్నారని,తవ్విన కొద్ది నకిలీ విత్తనాలు బయటపడతాయని రైతు సంక్షేమం కోసం పోరాడే రైతు బిడ్డ బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ తెలిపారు.గోదాములు,ప్రాసెసింగ్ కేంద్రాలు,దుకాణాల సోదాల్లో దొరుకుతున్న విత్తన నిల్వలు,ఉభయ తెలుగు రాష్ట్రాలలో అక్రమాల విజృంభనను కళ్లకు కడుతున్నాయని,సూర్యాపేట జిల్లా మాచనపల్లి గ్రామ రైతునేత వీరబోయిన వెంకట్ యాదవ్ 9010113619 చెప్పిన మాటలను రైతు నేస్తం మన బోరన్న ముఖ్యమంత్రులకు గుర్తు చేశారు.
నకిలీ విత్తన వ్యాపారానికి కీలక స్థావరాలుగా నిజామాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాలు ఏళ్లతరబడి తెలుగు ఈ7జాతి పరువు తీస్తున్నాయని న్యాయవాది,బీఎస్పీ నేత,కాన్షీరామ్ ప్రియ శిష్యురాలు,ప్రజారాజ్యం మాజీ నేత చందవోలు శోభారాణి 9848541714 వ్యక్తం చేసిన ఆవేదనను అర్థం చేసుకోవాలని బోరన్న పేర్కొన్నారు.గతంలో సూర్యాపేట,అదిలాబాద్, విజయవాడ,గుంటూరు ప్రాంతాలలో కోట్ల రూపాయల కల్తీ సరుకును పట్టుకున్న విషయాన్ని బోరన్న గుర్తు చేస్తూ పీడీ చట్టం ప్రయోగించి నకిలీ దందాసురుల పీచమణచాలన్న ఆదేశాలు వాస్తవిక కార్యాచరణాలలో కాగితం పులుల ప్రకటనలాగా బోసన్న ఎద్దేవా చేశారు.
ప్రస్తుత సీజన్లో ప్రధాన పంటలకు రాయితీలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో,ప్రైవేటు కంపెనీలు అమ్మే వాటిపైనే రైతులు ఆధారపడ్డారని, దీంతో రైతుల అవసరాలను దళారులు సొమ్ము చేసుకుంటున్నారని బోసన్న ఆరోపించారు.స్వేదం చిందించి సేద్యం చేసేది రైతు అయితే,రైతుల కష్టం దోచి కరెన్సీ మూటగట్టేది వ్యాపార దోపిడి దళారులని బోరన్న తేల్చి చెప్పారు.
ఎన్నాళ్లు,ఎన్నేళ్లు రైతుల కష్టం దోచుకునే దళారుల రాజ్యం నడుస్తది?ఎప్పటికీ వస్తది రైతే రాజయ్యే రోజు? అని బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.విత్తన వ్యాపారులతో అధికారుల అపవిత్ర పొత్తు అన్నదాతల నోట్లో మన్ను కొడుతుందని తన బామ్మర్ది సిపిఎం రైతు నేత మట్టపల్లి సైదయ్య యాదవ్ 8106778287 సూర్యాపేటలో చెప్పిన మాటల్లో వాస్తవాలను గుర్తించాలని బోర సుభాషన్న పాలకులకు హితవు పలికారు.
వేల కోట్ల రూపాయల కల్తీ సరుకు నిలువలు,నకిలీ విత్తన కలుపు ఏటా ఏపుగా విస్తరిస్తున్నదని,అదును చూసి అధిక దిగుబడుల ఆశ చూపి అక్రమార్కులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారని,మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న ఆశ రైతును ఏటా కడగండ్ల పాలు చేస్తోందని,నకిలీ విత్తనాల బెడద రైతును కష్టాల్లోకి తోసేస్తుందని బోరన్న ఆవేదన వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలలో విత్తనాలన్ని నకిలీ నాసిరకమేనని,కల్తీ విత్తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని మహిళా రైతు సంఘం నాయకురాలు కుంభం మంజులా రెడ్డి 9492963359 చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా అభ్యుదయవాది బోరన్న పేర్కొన్నారు.
ప్రతియేటా సాగు సమయానికి కంటే ముందే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయని,అసలేదో,కల్తీ ఏదో ఏ మాత్రం తేడా కనబడకుండా రంగు రంగుల బొమ్మలతో ప్యాకింగ్ లు తయారు చేస్తారని,ఈ విత్తనాలు వేయడం ద్వారా దండిగా దిగుబడి వస్తుందని,రైతులను బాగా నమ్మిస్తున్నారని,వాటిని కొనుగోలు చేసి సాగు చేసిన తరువాత గాని అవి నకిలీ విత్తనాలనే విషయాన్ని గ్రహించలేక పోతున్నామని,మహబూబాబాద్ జిల్లా తాళ్ల ఊకల్ గ్రామ రైతు,తన మేనత్త మట్టపల్లి ఐలమ్మ మల్లయ్యల కొడుకు వెంకన్న యాదవ్ 9603085363 చెప్పిన విషయాన్ని రైతు శ్రేయోభిలాషి బోర సుభాషన్న గుర్తు చేశారు.తాము భూమిలో విత్తేది విత్తో విపత్తో తెలుసుకోలేని అంతుచిక్కని దుస్థితిని ఎదుర్కొంటున్నామని,సూర్యాపేట,మక్త కొత్తగూడెం రైతు వేల్పుల శ్రీశైలం గౌతమి 9848641522 బొప్పారం గ్రామ రైతు జటంగి సైదయ్య రేణుక 9347862846 చెబుతున్న బాధాకర మాటలను పాలకులు పట్టించుకోవాలని బోరన్న కోరారు.
విత్తనాలు మార్చడం ద్వారా దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రైతులు రంగురంగుల ప్యాకింగ్ లు చూసి మోసపోతున్నారని,నిజమైన విత్తనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ నకిలీ విత్తనాల ప్యాకింగ్ లు అచ్చు గుద్దినట్లు తయారుచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని,గల్లీకో ఏజెంట్ జిల్లాలో వేలాది నకిలీ ముఠాలు గద్దల్లా రైతుల నెత్తిపై వాలుతున్నాయని,కార్మిక,కర్షక అభివృద్ధిని కోరుకునే ప్రజానేస్తం బోర సుభాషన్న 9848540078 పేర్కొన్నారు.రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దళారులు కోట్లాది రూపాయలు దండుకున్నారని,రైతులకు అప్పులు,ఆత్మహత్యలు కానుకలుగా మిగులుతున్నాయని బోర సుభాషన్న కన్నీరు పెట్టారు.
సాగుకు ముందుగానే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం,ఆలస్యమైతే విత్తనాలు దొరకవనే భయంతో చాలామంది రైతులు ముందుగానే కొనుగోలు చేస్తారని,నకిలీ విత్తనాలు ప్యాకింగ్ చేయడంలో హైదరాబాద్,విజయవాడ కేరాఫ్ అడ్రస్ గా మారాయని దొంగ సరుకు నిల్వ చేసే గోదాముల ప్యాకింగ్ సెంటర్లపై పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారులు ఉత్తుత్తి దాడులు తప్ప,ఉగ్ర రూపం చూపడం లేదని బోరన్న విమర్శించారు.పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి మాత్రమే విక్రయించాలని,వ్యవసాయ శాఖ నిబంధనలు ఉన్నా చాలా చోట్ల విడి విత్తనాలు అమ్ముతూనే ఉన్నారని,తొలకరికి ముందే నకిలీ పత్తి, మిరప విత్తనాల దందా కొనసాగుతోందని,తెలంగాణ, ఆంధ్ర అక్రమాలకు తోడైన కర్ణాటక,మహారాష్ట్ర దొంగల ముఠాలు నాసిరకం విత్తనాలను మార్కెట్లో అమ్ముతుంటే తూతూ మంత్రంగా టాస్క్ఫోర్స్ తనిఖీలు ఉన్నాయని కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోర సుభాషన్న ఆరోపించారు.
భూమిని, కష్టాన్ని నమ్ముకుని బతికే రైతులను మోసం చేసేందుకు కేటుగాళ్లు మార్కెట్లో విచ్చలవిడిగా పెరిగి పోతున్నారని,పైరు ఎదుగుదల,గింజల నాణ్యత,పంట దిగుబడి అన్నింటికీ మేలిమి విత్తన లభ్యత అత్యంత కీలకమని,కానీ,కల్తీ ఉగ్రవాదం దేశ రైతాంగాన్ని నడ్డి విరుస్తోందని విప్లవ నేతాజీ బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.నకిలీ,నాసి విత్తనాలు బోగస్ ప్యాకింగ్ ల ఉరవడి బోరన్నను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
లైసెన్సు కలిగిన వ్యాపారుల్లోనూ అధిక శాతం మందికి విత్తనశుద్ధి ప్లాంట్లు అయినా లేవని,నకిలీ విత్తనాలపై దొంగ వ్యాపారుల భాగోతాలపై డేగకన్ను వేయాల్సిన వ్యవసాయ అధికారులు,లంచవతారులై అవినీతి మత్తులో మునిగిపోతున్నారని బోర సుభాషన్న ఆరోపించారు.నకిలీ విత్తనాల కారణంగా అప్పోసప్పో చేసి పెట్టిన పెట్టుబడుల్ని నష్టపోయి విలపిస్తున్నది రైతులోక్కరే కాదని,ఉత్పాదకత కుంగి దేశార్థిక వ్యవస్థ కుదేలవుతోందని బోరన్న బాధపడ్డారు.
అన్నదాతల బతుకుల్లో నిప్పులు పోస్తున్న నాసి విత్తన తయారీదారులు అక్షరాల సామాజిక ద్రోహులని బోరన్న అభివర్ణించారు.పెరూ,చిలీ,బెల్జియం వంటి చిన్న దేశాలు విత్తన ఎగుమతులతో విశేష లాభాలు అర్జీస్తుండగా,దేశంలో వ్యవస్థగత వైఫల్యాలు అంతులేని సంక్షోభానికి బీజాలు వస్తున్నాయని, దేశాన్ని ప్రేమించే దేశభక్తుడిగా,తన లాంటి వారిని నిత్యం కలవరపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నకిలీ విత్తనాల మూలంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని,వారి ఆస్తులను జప్తు చేసి,నష్టపోయిన రైతులకు పంచాలని,మొక్కుబడిగా నాణ్యతను ధ్రువీకరించిన అధికారుల భరతం పట్టాలని,విత్తన మాఫియాతో కుమ్మక్కైన అధికారుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని,ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పంచాలని,రైతుబంధు,రైతుభరోసాలు మాత్రమే కాదు నాణ్యత,నవ్యత కలిగిన విత్తనాలను,మందులను రైతులకు సబ్సిడీలపై ప్రభుత్వమే అందివ్వాలని,విత్తనాల అమ్మకాలపై పర్యవేక్షణలో,తనిఖీల బృందాలలో,వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓ) లకు చోటు కల్పించాలని,దళారుల,దగాకోరు చర్యల నుండి నిరంతరం రైతులను అప్రమత్తంగా ఉంచుటకు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని,రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం తగిన పటిష్ట చట్టం రూపొందించాలని,దేశంలో పంట దిగుబడులు రైతుల నిజ ఆదాయాల పెంపుదల కోసం ఒట్టి మాటలు కట్టిపెట్టి కార్యదక్షత కలిగిన ఆచరణాత్మక కర్తవ్యం చేపట్టాలని ప్రజాతంత్రవాది, విప్లవ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి,కామ్రేడ్ బోర సుభాషన్న డిమాండ్ చేశారు.రైతులు,వ్యవసాయ కూలీలు,వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ సంక్షోభం-వ్యవసాయ మార్గాలు అనే అంశంపై ఈ పుస్తకాన్ని తెస్తామని బోరన్న తెలిపారు.
రచయితలు,అన్నదాతలు,శ్రేయోభిలాషులు తమ రచనలను బి జె ఆర్ సర్దార్ పటేల్, 2-2-231,ఎఫ్:202 అపోజిట్ గాంధీ విగ్రహం,బాగ్ అంబర్పేట్,హైదరాబాద్ -500013 కు పంపాలని,వాట్సాప్ నెంబర్ 9848540078 పంప వచ్చునని సిపిఐ ఎంఎల్ కార్యదర్శి బోర సుభాషన్న తెలిపారు.