మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన కన్నెబోయిన వెంకన్న అనే రైతు సాగర్ ఆయకట్టు కింద 5 ఎకరాల వరి సాగు చేశారు.నీళ్లు లేక చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో గొర్రెలను మేపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆరుతడి పంటకు నీళ్లు ఇచ్చినా తమ పంట ఎండిపోయేది కాదని, వరి పంట వేసి అప్పుల పాలు అయ్యామని వాపోతున్నారు.ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇది చూసిన గ్రామస్తులు అయ్యో… అన్నదాతకు ఎంత కష్టం వచ్చిందిరా అంటూ నిట్టూర్చుతున్నారు.