కంటైనర్ దొంగల కథ ముగిసింది

నల్గొండ జిల్లా:మాంసం కంటైనర్ ను ఎత్తుకెళ్ళి 5 లక్షలు డిమాండ్ చేసిన ముఠాను దేవరకొండ పోలీసులు పట్టుకున్నారు.శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.

 The Story Of The Container Thieves Is Over-TeluguStop.com

హైదరాబాదు లక్డీకాపూల్ కు చెందిన మహ్మద్ అన్వర్ సినీరు లాజిస్టిక్స్ పేరుతో గత 7 సంవత్సరాలుగా బర్రె (గేదె) మాంసాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలకు సరఫరా చేసే వ్యాపారం చేసేవాడు.మొన్న 11 తేదీన రాత్రి 20 టన్నుల బర్రె మాంసం లోడుతో హైదరాబాదు నుండి చెన్నై వెళ్తుండగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లిలోని కేస్యతండా వద్ద ఇన్నోవా వాహనంలో ఆరుగురు వచ్చి కంటైనర్ వాహనానికి అడ్డంగా ఇన్నోవాను ఆపి డ్రైవర్ ను బెదిరించి కంటైనర్ ను తీసుకెళ్లారు.5 లక్షలు ఇస్తేనే కంటైనర్ ను వదిలేస్తామని బెదిరించడంతో ఈనెల13 వ తేదీన అన్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దుండగులు డిమాండ్ చేసిన రూ.5 లక్షల డీల్ కు ఒప్పుకొని మూడు దఫాలలో ఇస్తానని చెప్పి మొదటగా సుమారు లక్షా నలభై వేల రూపాయలను వారికి పంపించాడు.మిగతా డబ్బులు ఇవ్వాలంటే మీరే వచ్చి కంటైనర్ ను అప్పగించి తీసుకెళ్ళమని ఎకౌంట్లో వేయనని,మీపై నమ్మకం లేదని అన్వర్ చెప్పడంతో ఆ దుండగులు కేస్యతండా వద్దకే డబ్బులు తీసుకుని రమ్మని,అక్కడే వనానం ఇస్తామని చెప్పారు.

ముందే సమాచారం ఉన్న పోలీసులు అక్కడే కాపుకాచి దుండగులు రాగానే చాకచక్యంగా వాళ్ళను అరెస్టు చేయడంతో కంటైనర్ కథకు శుభం కార్డు పడింది.అదుపులోకి తీసుకున్న వారిని ఇంట్రాగేషన్ చేయగా తామే చేశామని ఒప్పుకోవడంతో ముఠా వద్ద నుండి లక్ష రూపాయల నగదు మరియు ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి,ఆరుగురిని రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube