ఒకేసారి మూడు సినిమాల్లో హీరోగా ఈటీవీ ప్రభాకర్ కొడుకు.. నవ్వొచ్చిందంటూ కామెంట్స్!

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ గురించి మనందరికీ.బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

 Etv Prabhakar Son Chandrahas Grand Launch And Movie Updates Prabhakar, Chandraha-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.తాజాగా సెప్టెంబర్ 16న చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి హీరోగా పరిచయం ప్రభాకర్.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మా అబ్బాయిని పరిచయం చేయడానికి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

మా అబ్బాయి యూట్యూబ్లో నాటు నాటు సాంగ్ చేస్తున్నప్పుడు చాలామందికి వాడు మా అబ్బాయి అని తెలియదు.

కానీ చాలామందికి తెలియని విషయాన్ని ఇప్పుడు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చాము.

వాడు మా అబ్బాయి.మా అబ్బాయి ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మా అబ్బాయి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కంటే సక్సెస్ అయినప్పుడు మరింత సంతోషంగా ఫీల్ అవుతాను అని తెలిపాడు ప్రభాకర్.మొదటి సినిమాకి పగలు రాత్రి కష్టపడి పని చేశాడు.

కష్టపడి పని చేసిన వాడికి ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అన్నది ఉండదు ఎప్పటికైనా తప్పకుండా సక్సెస్ అవుతారు అని చెప్పుకొచ్చాడు ప్రభాకర్.మా అబ్బాయి చిన్నప్పటి నుంచి హీరో అవుతాను అనే వాడు అప్పుడు వాడిని చూసి నేను నవ్వుకునే వాడిని.

కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అలాగే ఫీల్ అవుతుంటే ఏంట్రా అనుకున్నాను.ఐదేళ్ల క్రితమే నాకు వాడి అభిప్రాయం చెప్పగా కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పాను అనుకున్నట్టుగానే వాడు రెండు సినిమాలు చేస్తున్నాడు.

Telugu Avr, Chandrahas, Krishna, Naresh, Prabhakar, Tollywood-Movie

ఫస్ట్ సినిమాలో ఫైట్స్ తో కుమ్మేశాడు అని చెప్పుకొచ్చాడు ప్రభాకర్.కథలపరంగా వాడికి ఏ కథ సూట్ అవుతుందో ముందు నేను వింటాను.మినిమమ్ గ్యారంటీ ఉండేలా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా అని చెప్పారు ప్రభాకర్.రెండు సినిమాల విషయానికొస్తే.కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.ఈ చిత్రానికి కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాతలుగా ఉన్నారు.

ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై ఏవీఆర్‌, నరేష్‌ నిర్మాణంలో సంపత్‌ వి.రుద్ర దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నారు చంద్రహాస్.ప్రభాకర్ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ పతాకంపై మూడో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.ఆ చిత్రానికి కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌ సహ నిర్మాతలుగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube