కంటైనర్ దొంగల కథ ముగిసింది

నల్గొండ జిల్లా:మాంసం కంటైనర్ ను ఎత్తుకెళ్ళి 5 లక్షలు డిమాండ్ చేసిన ముఠాను దేవరకొండ పోలీసులు పట్టుకున్నారు.

శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.

హైదరాబాదు లక్డీకాపూల్ కు చెందిన మహ్మద్ అన్వర్ సినీరు లాజిస్టిక్స్ పేరుతో గత 7 సంవత్సరాలుగా బర్రె (గేదె) మాంసాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలకు సరఫరా చేసే వ్యాపారం చేసేవాడు.

మొన్న 11 తేదీన రాత్రి 20 టన్నుల బర్రె మాంసం లోడుతో హైదరాబాదు నుండి చెన్నై వెళ్తుండగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లిలోని కేస్యతండా వద్ద ఇన్నోవా వాహనంలో ఆరుగురు వచ్చి కంటైనర్ వాహనానికి అడ్డంగా ఇన్నోవాను ఆపి డ్రైవర్ ను బెదిరించి కంటైనర్ ను తీసుకెళ్లారు.

5 లక్షలు ఇస్తేనే కంటైనర్ ను వదిలేస్తామని బెదిరించడంతో ఈనెల13 వ తేదీన అన్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దుండగులు డిమాండ్ చేసిన రూ.5 లక్షల డీల్ కు ఒప్పుకొని మూడు దఫాలలో ఇస్తానని చెప్పి మొదటగా సుమారు లక్షా నలభై వేల రూపాయలను వారికి పంపించాడు.

మిగతా డబ్బులు ఇవ్వాలంటే మీరే వచ్చి కంటైనర్ ను అప్పగించి తీసుకెళ్ళమని ఎకౌంట్లో వేయనని,మీపై నమ్మకం లేదని అన్వర్ చెప్పడంతో ఆ దుండగులు కేస్యతండా వద్దకే డబ్బులు తీసుకుని రమ్మని,అక్కడే వనానం ఇస్తామని చెప్పారు.

ముందే సమాచారం ఉన్న పోలీసులు అక్కడే కాపుకాచి దుండగులు రాగానే చాకచక్యంగా వాళ్ళను అరెస్టు చేయడంతో కంటైనర్ కథకు శుభం కార్డు పడింది.

అదుపులోకి తీసుకున్న వారిని ఇంట్రాగేషన్ చేయగా తామే చేశామని ఒప్పుకోవడంతో ముఠా వద్ద నుండి లక్ష రూపాయల నగదు మరియు ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి,ఆరుగురిని రిమాండ్ కు తరలించారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ ! ఎందుకు వెళ్ళారంటే ?