పల్లె ప్రకృతి పేరుతో పేద రైతుల భూములు లాక్కున్న అధికారులు

నల్లగొండ జిల్లా: తాతలకాలం నాటి నుండి వారసత్వంగా వచ్చిన భూములు కొందరివి,డబ్బులతో వేరే వారి దగ్గర కొనుగోలు చేసిన భూములు కొందరివి,భూమి రిజిస్టేషన్ ఉండి,రైతు బంధు కూడా వస్తున్న భూములు మరికొందరివి ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులను తెలంగాణ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జీవితమే లేకుండా చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.కనగల్ మండలం జి.

 Officials Grabbing The Lands Of Poor Farmers In The Name Of Rural Nature-TeluguStop.com

యడవల్లి గ్రామానికి చెందిన 30 రైతు కుటుంబాలు ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో పల్లె ప్రకృతి వనం కోసం పేద రైతులకు జీవనాధారమైన 43 ఏకరాల భూమిని లాక్కోవడంతో వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఇదే విషయం అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.ప్రకృతి వనం కోసం పేదల భూములు తీసుకోవడం వల్ల రైతులు జీవన ఆధారం కోల్పోయామని,న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కి, స్థానిక ఎమ్మెల్యేకి వినతి పత్రాలు ఎన్నోసార్లు అందజేసినా తమకు న్యాయం జరగడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.

ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులని పథకాల పేరుతో రోడ్డున పడేశారని,రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎవరిని అడగాలని ప్రశ్నించారు.ఎక్కడా న్యాయం దొరకక పోవడంతో తమకు న్యాయం చేయాలని 7-3-2022 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు.

గ్రామం నుండి ర్యాలీతో వెళ్లి నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టబోతున్నామని,ప్రభుత్వం కదిలొచ్చే విధంగా అందరూ పాల్గోని రైతులకి న్యాయం జరిగేలా మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube