మెగా కాంపౌండ్- శృతిహాసన్ బాండింగ్.. ఒక కామన్ ఫ్యాక్టర్ మీకు తెలుసా?

శృతిహాసన్.కొన్నాళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.

 Unknown Facts About Relation Between Mega Compound And Sruthi Haasan , Sruthi H-TeluguStop.com

రవితేజతో క్రాక్ సినిమాల్లో నటించి మంచి సూపర్ హిట్ అందుకున్న తర్వాత మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.

యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించేందుకు సిద్ధమైపోతుంది ఈ సొగసరి.

Telugu Avadu, Chiranjeevi, Crack, Devi Sri Prasad, Gabbar Singh, Compound, Pawan

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత కొణిదల కాంపౌండ్ తో శృతి హాసన్ కి ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది అని చెప్పాలి.ఎందుకంటే ప్రస్తుతం మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతో మంది హీరోల సరసన నటించింది ఈ సొగసరి. పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో నటించింది.

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక సినిమాలో నటించేందుకు సిద్ధమైంది.యువ దర్శకుడు బాబీ తో మెగాస్టార్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

Telugu Avadu, Chiranjeevi, Crack, Devi Sri Prasad, Gabbar Singh, Compound, Pawan

మా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు సిద్ధమైంది కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఇక ఇటీవలే మెగా కాంపౌండ్ లో శృతిహాసన్ అనుబంధం గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.శృతిహాసన్ మెగా కాంపౌండ్ హీరోలతో సినిమా చేసినప్పుడల్లా ఒక కామన్ ప్యాక్ట్ రిపీట్ అవుతూనే ఉంది అని తెలుస్తుంది.అదేమిటో కాదు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ లో కలిసి నటించింది శృతిహాసన్.ఇక ఆ సమయంలో ఆ సినిమాకు మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్.

ఆ తర్వాత చరణ్ తో కలిసి ఎవడు సినిమా చేసింది.దానికి స్వరకర్త దేవిశ్రీ నే కావడం గమనార్హం.

ఇప్పుడు చిరుతో కలిసి శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇలా శృతిహాసన్ మెగా కాంపౌండ్ తో అనుబంధం లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube