నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తికి నిరసన సెగ...!

నల్లగొండ జిల్లా: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి అన్నదాతల నుండి ఊహించని నిరసన సెగ తగిలింది.గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బయలుదేరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాన్వాయ్‌ ని ఈదులూరు గ్రామంలో రైతులు అడ్డుకున్నారు.

 Farmers Protest Against Nakirekal Mla Chirumarthi Lingaiah,farmers Protest ,naki-TeluguStop.com

రెండు నెలలు గడుస్తున్నా కాంటాలు కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కారు క్రింద పడుకోని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లడుతూ గత రెండు నెలలుగా రైతులు నానా తంటాలు పడుతున్నమన్నారు.

సకాలంలో ధాన్యం కాంటాలు కాకపోవడంతో ఇటివలే స్ధానిక గ్రామస్తుడు గుండె ఆగి చనిపోయాడని అవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఈదులూరు గ్రామానికి కలెక్టర్ వస్తున్నాడన్నా సమాచారం రైతుల్లో విశ్వాసాన్ని నింపిందన్నారు.

అయితే కలెక్టర్ రాకకు కట్టంగూర్ పిఎసిఎస్ చైర్మన్ నూక సైదులు బ్రేక్ వేశారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.అయినా రైతులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో పత్రికా ప్రకటనలకే రైతు రాజ్యమని నేతలు గప్పాలు కోట్టుడు తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube