సినిమా పరిశ్రమలోకి నిత్యం పదుల సంఖ్యలో నటీనటులు వస్తుంటారు.పోతుంటారు.
కానీ.కొందరు ఇలా వచ్చి అలా వెళ్లినా జనాల మదిలో నిలిచిపోతారు.
అలాంటి వారిలో ఒకరుగా నిలిచిపోతుంది అషిమా భల్లా.టాలీవుడ్ లో ఈమె నటించింది చాలా తక్కువ సినిమాలే.అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అస్సాంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తొలుత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.ప్యార్ జిందగీ హై అనే హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత తెలుగులో డాడీ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా చేసింది.
ఆ తర్వాత మరో హిందీ సినిమాలో హీరోయిన్ గా చేసింది.మరో హిందీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.
తెలుగులో ఆమె నటించిన సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చిన మూవీ చెప్పవే చిరుగాలి.2004లో వచ్చిన ఈ సినిమాలో హీరోగా వేణు తొట్టెంపూడి నటించాడు.ఉన్నై నిన్నైత్తు అనే తమిళ సినిమాకు ఈ సినిమా రీమేక్.తమిళ సినిమాలో హీరోగా సూర్య నటించాడు.తెలుగు సినిమాలో వేణు, అషిమా నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు.వేణు ప్రేమికురాలి పాత్రలో ఆమె చక్కటి నటన కనబర్చింది.
అటు చిరంజీవి- వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఠాగూర్.ఈ సినిమా తమిళ మూవీ రమణకు రీమేక్.
ఠాగూర్ సినిమాలో శ్రియ పోషించిన పాత్రను తమిళ మూవీలో అషిమా చేసింది.ఒక హిందీ, మరో తమిళ సినిమాలో నటించిన ఆమె.తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమా తర్వాత ఓ కన్నడ, మరో హిందీ సినిమా చేసింది.దీంతో పాటు నాయుడు ఎల్ఎల్ బి అనే తెలుగు సినిమాలో కూడా నటించింది అషిమా.ఈ సినిమా తర్వాత మరో రెండు తమిళ సినిమాల్లో నటించింది.
చివరగా తంబి అర్జున అనే తమిళ సినిమాలో నటించింది.ఆ తర్వాత హిందీలో రెండు సీరియల్స్ చేసింది.
వీటితో పాటు మరికొన్ని రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేసింది.చివరిసారిగా 2018లో మేరే పాపా హీరో హీరాలాల్ అనే సీరియల్ లో నటించింది.
అనంతరం టీవీ, సినిమా రంగాలకు దూరంగా ఉంటుంది.ఈమెకు వివాహం అయ్యింది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భర్తతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది.ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే అషిమా.
అభిమానులతో టచ్ లో ఉంటుంది.