నల్లగొండ జిల్లా:భారీ బహిరంగ సభలు,జన సందోహం ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడే 8 మంది హైటెక్ అంతరాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు.మంగళవారం నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కేసు వివరాలను మీడియాకు వివరించారు.
మంగళవారం ఉదయం విజయపురి టౌన్ ఎస్‌ఐ సిబ్బందితో కలిసి హిల్ కాలనీలో పెట్రోల్లింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు హిల్ కాలనీ బస్సు స్టాప్ వద్ద కారుతో అనుమానాస్పదంగా కన్పించగా అదుపులోకి తీసుకున్నారు.వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఇట్ట వాసు,ఇట్ట సుబ్బారావు,బోరేతుల వెంకటేశ్వర్లు, గోదావరి ఏసోబు,బత్తుల ఉమామహేశ్వరరావు,జోష్ కుమార్,కట్ట రక్షక్ రాజు,బొచ్చు వరుణ్ అనే 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.వీరంతా ఆంద్రపదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందిన వారుగా గుర్తించామన్నారు.
వీరు విలాసాలకు అలవాటు పడి తాము చేస్తున్న పనిలో సరిపోను డబ్బులు రాక గత కొన్ని రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలు చేస్తూ 2022 ఏప్రిల్ 29 న చింతపల్లి,కొండమల్లేపల్లి, గుడిపల్లి,పెద్దవూర,విజయపురి పోలీసు స్టేషన్ పరిధిలో టిపిసిసి ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరైన పార్టీ మీటింగ్ లలో జేబు దొంగతనాలకు పాల్పడినారు.అదే విధంగా బహిరంగ సభలు,జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.
వీరి వద్ద నుండి ఆరు లక్షల రూపాయల నగదు,దొంగతనాలకి ఉపయోగించే ఒక ఫోర్డు కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వివిధ పోలీసు స్టేషన్ పరిధిలలో 9 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
గతంలో కూడా వీరిపైన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్,కరీంనగర్ జిల్లాలో మంచిర్యాల పోలీసు స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.నల్గొండ జిల్లాలో శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు,పెద్దవూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు,విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు వీరి పైన నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ కేసును మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వరావు,సి.సి.ఎస్.డి.ఎస్.పి మొగిలయ్య పర్యవేక్షణలో చేధించిన సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.జి.నాయుడు,విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి.రాంబాబు,పోలీస్ స్టేషన్ సిబ్బంది, సి.సి.ఎస్ సిబ్బందిని జిల్లా ఎస్.పి అభినందించారు.