అధిక రక్తపోటు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు నియంత్రణే తప్ప నివారణ లేదని రక్తపోటు నివారణ కు ఉప్పు వాడకం తగ్గించాల్సిందే నని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధులను నియంత్రణ చేయవచ్చని ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ వి గిరిసింహారావు పేర్కొన్నారు.ప్రపంచ “హైపర్ టెన్షన్ డే- బిపి నివారణ దినం” సందర్భంగా మంగళవారం ఉదయం ఖమ్మం నూతన ప్రయాణ ప్రాంగణం లోని సమావేశ మందిరంలో ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రసంగిస్తూ,రక్తపోటు(బిపి),షుగరు,కొలెస్టరాల్,థైరాయిడ్, అధికబరువు లాంటి అసాంక్రమిక వ్యాధులు ప్రబలడానికి కారణం ఒత్తిడి,శారీరక శ్రమ వ్యాయామం లేకపోవడం,మితిమీరిన ఆహారాన్ని తీసుకోవడం,వ్యాధులపట్ల అవగాహన లేకపోవడం కారణాలని పేర్కొన్నారు.ప్రతివొక్కరు తమ జీవన శైలిలో మార్పుల ద్వారా ఈ వ్యాధులని నియంత్రించుకోవచ్చని ఆయన సూచించారు.
అవగాహన శిభిరంలో దాదాపు 150 మంది సిబ్బందికి,ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.బిపి అనగాహనా కరపత్రాలని ఆవిష్కరించి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బస్ స్టేషన్ మేనేజర్ రఘుబాబు,కంట్రోలర్ చుట్టకుదుళ్ల రఘు,కార్గో పార్శిల్స్ ఇన్స్ఫెక్టర్ బాబూరావు,ఎగ్జిక్యూటివ్ వీరభద్రం,ఆర్టీసీ సెక్యురిటీ సబ్ ఇన్స్పెక్టర్ హన్మంతు,కానిస్టేబుల్ అస్లాంపాషా,ఓపీఆర్ఎస్ సూపర్వైజర్ రవి,బస్సాస్ కేవీలు,రిజర్వేషన్ బీజీబీచారీ,ఇంజినీరింగ్,మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.?
.






