కంటైనర్ లో ఆర్మీ జవాన్ నిరసన...అధికారుల జోక్యంతో విరమణ

నల్లగొండ జిల్లా( Nalgonda District ):తన స్థిరాస్తి గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని,తన భూమి తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ ఆర్మీ జవాన్ తన కంటైనర్ లో గత మూడు రోజులుగా నిరసన దీక్షకు దిగగా, అధికారుల జోక్యంతో దీక్ష విరమించి బయటికి వచ్చిన సంఘటన నల్లగొండ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.

 Army Jawan's Protest In Container...stopped With Intervention Of Authorities ,-TeluguStop.com

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్ రెడ్డి ( Army jawan Satish Reddy )తండ్రి(మాజీ సైనికుడు) స్థిరాస్తిని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేశారు.ఈ విషయమై ఆర్మీ జవాన్ సతీష్ రెడ్డి తమ భూమి తనకు ఇప్పించాలని ఎన్నిసార్లు, ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోక పోవడంతోఇక తనకు న్యాయం జరగదని భావించి గత మూడు రోజులు క్రితం తన కంటైనర్ లో వినూతమైన రీతిలో నిరసనకు దిగారు.

అతను నిరసనకు దిగిన విషయం తెలుసుకున్న అధికారులు,పోలీసులు శుక్రవారం కంటైనర్ దగ్గరకు చేరుకొని సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి,దీక్ష విరమింపజేసి, కంటైనర్ నుండి బయటికి వచ్చాక స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బాధితుడు శనార్తితో మాట్లాడుతూ మా నాన్న మాజీ సైనికుడు,నేను ఆర్మీ జవాన్,మా కుటుంబం దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపాలా కాస్తుంటే,దేశం లోపల మా భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతమంది అధికారులకు విన్నవించినా,ఎన్నిసార్లు ఆఫిస్ ల చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు.అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ విధంగా నిరసన దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించినందుకు ధన్యవాదాలు,కానీ,నా సమస్యకు పరిష్కారం చూపకపోతే కుటుంబంతో సహా నిరసనకు దుగుతామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube