నల్గొండ జిల్లా: నిడమానూరు మండలం గుంటుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ యువకుడి దారుణ పరువు హత్య కలకలం రేపింది.సమాచారం అందుకున్న మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి,హలియా సీఐ గాంధీ నాయక్,ఎస్ఐలు శోభన్ బాబు,క్రాంతి కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించిన పరిస్థితిని సమీక్షించారు.
ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరుపు బంధువులే హత్యకు పాల్పడ్డట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తూ ఘటనపై విచారణ చేపట్టారు.మృతుడి బంధువులు,స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (20) ఎస్సీ మాదిగ, తాళ్ల జ్యోతి(18) బీసీ ముదిరాజ్ ల మధ్య గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.ఆదివారం సాయంత్రం మృతుడు నవీన్ నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామంలో మద్యం సేవిస్తూ అమ్మాయి బంధువులకు ఫోన్ చేసి
ఏవిషయమైనా గుంటిపల్లికి రండి ఇక్కడ మాట్లాడుకుందామని అన్నాడు.
ఎలాగైనా నవీన్ ను అంతమొందించాలని సమయం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి బంధువులు ఆవేశంతో ఆదివారం సాయంత్రం ఆలస్యం చేయకుండా గుంటిపల్లి గ్రామంలో స్థానిక స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న నవీన్ దగ్గరకు తాళ్ల జ్యోతి బాబాయ్,బంధువులు కలిసి వచ్చి నవీన్,అతని స్నేహితుడి అనిల్ పై కత్తులతో దాడికి యత్నించగా మృతుడి స్నేహితుడు అనిల్,మరోక స్నేహితుడు అక్కడి నుండి పరారయ్యారు.దీనితో ఆవేశంలో ఉన్న అమ్మాయి బాబాయ్,బంధువులు నవీవ్ పై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
అబ్బాయి, అమ్మాయి కులాలు వేర్వేరు కావడంతో వారి ప్రేమను అంగీకరించని అమ్మాయి తరుపు వారు ఈ పరువు హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తుంది.