టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది.ఇంతకు మునుపు మన గొప్ప మనమే చెప్పుకునే వాళ్ళం.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది? దేశవ్యాప్తంగానే కాకుండా, విశ్వవ్యాప్తంగా కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది.మొన్నటికి మొన్న ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గారికి అవార్డు లభించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ స్పందిస్తూ… కల్కి సినిమాలోని తనకి పాత్ర ఇచ్చినందుకు, ఒక్క దర్శకుడు నాగ్ అశ్విన్ కి మాత్రమే కాకుండా, యావత్ తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగినది.ఇదొక్క ఉదాహరణ చాలు….
తెలుగు సినిమా కీర్తి దిగాంతాలకు చేరిందని ఇట్టే అర్థం అయిపోతుంది.
ఈ క్రమంలో ఇప్పుడు మన తెలుగువారు మాత్రమే కాకుండా, నార్త్ జనాలు కూడా మనక మన తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి.ఇక నార్త్ ఆడియన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ సినిమాలు ఎప్పుడు వస్తే అప్పుడే మేము థియేటర్లకు వెళ్తాము అంటూ భీష్మించుకొని కూర్చున్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి.
ఆమధ్య ఒక బాలీవుడ్ నటుడు ఈ విషయాన్ని బాహాటంగానే ఓ మీడియా వేదికలో ప్రస్తావించడం జరిగింది.దాంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారడం విశేషం.
ఇక అసలు విషయంలోకి వెళితే, కొన్ని బడా టాలీవుడ్ సినిమాలు 20207లో రిలీజ్ కావడానికి ముందస్తుగానే ప్రణాళికలు రచించుకున్నాయి.అవును, రెండు మూడేళ్ల తర్వాత రిలీజ్ చేయడానికి కొందరు మూవీ మేకర్స్ ఇప్పటి నుండే సన్నాహాలు చేసుకుంటున్నారు.అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu, rajamouli )కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక మూవీ.ఈ సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటినుండే కృషి చేస్తోంది.ఆ తర్వాత చెప్పుకోబోయేది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ సిరీస్.
ఇప్పటికే ఈ సినిమా రెండు పార్ట్స్ రిలీజ్ కాగా, మూడవ పార్ట్ 2027లో రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ మన తెలుగువాడన్న సంగతి అందరికీ తెలిసిందే.
మరోవైపు త్వరలో విడుదలకు రెడీ అవుతున్న సూర్య నటించిన సినిమా కొంగువ సీక్వెల్ కూడా 2027 లో రిలీజ్ చేయడం కోసం చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తోంది.ఇక కొంగువ సినిమాకి మన తెలుగు సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇలా ప్రస్తుతం మన తెలుగు వాళ్ళు లేనిదే ఎలాంటి సినిమా కూడా నిర్మించబడడం లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఇక ఈ 2027 కూడా మనకు తెలుగు వాళ్ళదే అని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు!
.