కెనడా( Canada )లో ఘోర విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
అంటారియో ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.టొరంటో నగరంలోని లేక్ షోర్ బౌలేవార్డ్ ఈస్ట్ , చెర్రీ స్ట్రీట్ ప్రాంతంలో గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు.
ఐదుగురు వ్యక్తులు టెస్లా కారు( Tesla )లో ప్రయాణిస్తుండగా.డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
ఇంతలో గార్డు రైలును, కాంక్రీట్ స్తంభాన్ని వీరి కారు ఢీకొట్టి మంటలు చెలరేగినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాదానికి పరిమితికి మించిన వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను తాము సేకరించినట్లు టొరంటో పోలీస్ డ్యూటీ ఇన్‌స్పెక్టర్ ఫిలిప్ సింక్లైర్ తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్ ఘటనాస్థలికి బయల్దేరారు.కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.కెనడా, భారత్‌లోని అధికారులతో కాన్సులేట్ టచ్‌లో ఉందని , బాధితులకు అవసరమైన అన్నిరకాల సాయాలు అందిస్తామని కాన్సులేట్ పేర్కొంది.
అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.ఈ ఏడాది జూలైలో కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములే కావడం దురదృష్టకరం.
ఈ తోబుట్టువులను పంజాబ్ రాష్ట్రం లూథియానా సమీపంలోని మలౌద్ గ్రామానికి చెందిన హర్మాన్ సోమల్ (23), నవజోత్ సోమల్ (19)గా గుర్తించారు.మూడో వ్యక్తి కూడా పంజాబ్( Punjab ) రాష్ట్రానికే చెందిన యువతిగా గుర్తించారు.
సంగ్రూర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భూపిందర్ సింగ్ , సుచేత్ కౌర్ దంపతుల కుమార్తె రష్మ్‌దీప్ కౌర్ (23) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.విద్యార్ధులు మౌంటెన్ సిటీలో తమ పీఆర్ (పర్మినెంట్ రెసిడెంట్) ఫైల్‌లను సమర్పించి , టాక్సీలో తిరిగి వస్తుండగా టైర్ పగిలి వాహనం బోల్తా పడిందని బంధువులు తెలిపారు.
ముగ్గురు పిల్లలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.టాక్సీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.నాలుగేళ్ల క్రితమే రష్మ్‌దీప్ కౌర్ కెనడా వెళ్లారని చెప్పారు.