ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో అయిపోయాడు రామ్ చరణ్.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు బన్నీ.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఇండియాలో అగ్రహీరోలుగా రాణిస్తున్నారు.అయితే చిన్నప్పుడు వీరిద్దరికీ ఒకరి చేతిలో దెబ్బలు తిన్నారు ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చిరంజీవి చెప్పిన విలువలే ఇప్పుడు వీరిని ఇంత దాకా తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు.
రామ్ చరణ్(Ram Charan) ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి తనను ఎందుకు కొట్టాడో, బన్నీపై ఎందుకు చేయి చేసుకున్నాడో చెప్పాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ “మా నాన్న బయట మెగాస్టార్ అయ్యుండొచ్చు కానీ ఇంట్లో మాత్రం ఒక సాధారణ తండ్రి లాగానే ప్రవర్తిస్తాడు.ఇంట్లో డ్యాన్సులు చేయడానికి అస్సలు ఇష్టపడడు.నట జీవితాన్ని బయటనే ఉంచుతాడు.
నేను మా నాన్నతో ఏదంటే అది మాట్లాడతాను.ఆయన మూడ్ ఎలా ఉందో గమనించి దేని గురించైనా మాట్లాడే స్వేచ్ఛ నాకు ఆయన ఇచ్చారు.
కానీ చిన్నప్పుడు ఒక రోజు నన్ను మా తాతయ్య బెల్ట్ తో కొట్టారు.రిటైర్ అయ్యాక మా తాత మా నాన్నకు పోలీస్ బెల్టు ఇచ్చారు.
అదే బెల్ట్ తో నన్ను కొట్టారు.ఎందుకంటే ఒకరోజు మా సెక్యూరిటీ గార్డ్ కి, డ్రైవర్ కి ఎంట్రన్స్ గేటు దగ్గర ఒక గొడవ జరిగింది.
ఆ సమయంలో వారు బూతులు తిట్టుకున్నారు.అదే మాటలు విని నేను మా ఇంట్లో కూర్చున్న నాగబాబు(Naga Babu) దగ్గరికి వచ్చి వారన్న మాటనే అన్నాను.
అసలు ఆ మాటకు అర్థం ఏంటో కూడా నాకు తెలియదు.నాగబాబుని ఆ పదం అనగానే ఆయన షాక్ అయ్యారు.వెంటనే పైన ఉన్న మా నాన్న దగ్గరకు నన్ను తీసుకెళ్లారు.‘ఏంటన్నయ్య వీడు నన్ను ఇలా అంటున్నాడు’ అని చెప్పారు.దాంతో మా నాన్న నన్ను అదే రూమ్ లో ఉండమని మిగతా వారిని పంపించారు.బెల్ట్ తీసుకొని రెండు దెబ్బలు నన్ను కొట్టారు.అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మా నాన్న నా మీద చేయి చేసుకోవడం.ఈ ఘటన తర్వాతే నాగబాబుతో నేను కొన్ని రోజులు మాట్లాడలేదు అది బూతు మాట అని, అలా అనకూడదని నాతో ఏపీ ఉంటే అయిపోయేది మా నాన్న దగ్గరికి తీసుకెళ్లి కొట్టించారు.” అని చెప్పుకొచ్చాడు.
బన్నీని ఎందుకు కొట్టాడో వివరిస్తూ “ఇంట్లో ఆడవాళ్లకు ఎవరైనా ఎదురు చెప్తే మా నాన్నకు అసలు నచ్చదు.ఏదైనా అంటే వెంటనే కొట్టేస్తారు.ఒకసారి బన్నీకి కూడా దెబ్బలు పడ్డాయి.
బన్నీ(Bunny) మా అత్తకి ఒకసారి ఎదురు తిరిగాడు.అప్పుడు మా నాన్న అతనిపై చేయి చేసుకున్నాడు.
వరుణ్ గారి పెద్దకొడుకును కూడా కొట్టాడు.ఆడవాళ్లను ఎవరైనా ఏదైనా అంటే మా నాన్నకి కోపం తెగ కోపం వచ్చేస్తుంది.” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.