యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల ఆదివారానికి మూడో రోజుకు చేరుకున్నాయి.3వ రోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్,దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,
దళిత బహుజన ఫ్రంట్ మహిళా కార్యదర్శి పులి కల్పన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో కార్మిక హక్కుల రూపొందించి కార్మిక సంక్షేమం కోసం కృషి చేసిన మొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని,8 గంటల కార్మికుల పని విధానం,కార్మికుల భద్రత జీవన హక్కు కనీస వేతన చట్టం,కుటుంబ సంక్షేమం కోసం ఆనాడే చట్టాలను రూపొందించి కార్మికుల సంక్షేమం కోసం రాజ్యాంగం రచించారని కొనియాడారు.ప్రతి ఒక్కరి కోసం రాజ్యాంగంలో చట్టాలను రూపొందించి, అమలుపరిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.







