తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో సూర్య గురించి, ఆయన భార్య జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని నిజ జీవితంలో కూడా ఒక్కటి అయ్యారు.ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా హీరో సూర్య కుటుంబ ముంబై కి షిఫ్ట్ అవ్వడం పట్ల అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూర్య( Suriya ) మాట్లాడుతూ.జ్యోతిక తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకు వచ్చింది.
మా పెళ్లి అయిన తర్వాత అక్కడే ఉన్నాము.

ఆమె నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది.ముంబయి( Mumbai )లోని తన స్నేహితులను, కెరీర్‌ను వదులుకుంది.తన జీవనశైలిని మార్చుకుంది.
కరోనా తర్వాత మార్పు అవసరం అనిపించింది.అందుకే ముంబయి షిఫ్ట్ అయ్యాము.
ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయి.విభిన్నమైన ప్రాజెక్ట్ లలో పని చేస్తోంది.
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సవాళ్లను ఎదుర్కొంటోంది.నేను గొప్ప దర్శకులతో పనిచేయాలని అనుకుంటాను.
కానీ తను మాత్రం ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటుంది.</br

ఇటీవల ఆమె నటించిన శ్రీకాంత్, కాదల్ – ది కోర్ చిత్రాలు ( Kaathal The Core )ఎంత వైవిధ్యమైనవో తెలిసిందే.మహిళలకు కూడా పని విషయంలో స్వాతంత్య్రం ఉండాలని నేను భావిస్తాను.పురుషుల వలే వారికి కూడా సెలవులు, స్నేహాలు అవసరం.
ఇప్పుడు జ్యోతిక తన కుటుంబంతో, పాత స్నేహితులతో సమయం గడుపుతోంది.అలాగే వృత్తిపరంగా కూడా బిజీగా ఉంది.
నేను ముంబయిలో ఉన్న సమయంలో పూర్తిగా పనిని పక్కన పెట్టేస్తాను.నెలలో 10 రోజులు కుటుంబానికి కేటాయిస్తా అని సూర్య చెప్పుకొచ్చారు.







