మన లక్ష్యం బలమైనది అయితే సులువుగానే ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.పట్టుదల, కసి ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని శ్రీనిధి ప్రూవ్ చేశారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన శ్రీనిధి 19 సంవత్సరాల వయస్సులోనే నేవీ ఉద్యోగం సాధించడం గమనార్హం.శ్రీనిధి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
శ్రీనిధి పూర్తి పేరు బందాపు శ్రీనిధి కాగా ఈమె తండ్రి తేజేశ్వరరావు గొర్రెల కాపరిగా(Father Tejeswara Rao , shepherd) పని చేశారు.శ్రీనిధి(Srinidhi) తల్లి గౌరి గృహిణిగా ఉన్నారు.
ఈ కుటుంబం పేద కుటుంబం కాగా శ్రీనిధి చెల్లి శ్రీజ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నారు.శ్రీనిధి పెదనాన్న ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పని చేశారు.
నేవీలో ఉద్యోగం సాధించాలని కలలు కన్న శ్రీనిధి ఆ కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.

శ్రీనిధి ప్రతిరోజూ పరుగులో సాధన చేయడంతో పాటు వ్యాయామాలు చేసేవారు.ఏదైనా సాధించాలనే లక్శ్యంతో పని చేసిన శ్రీనిధి ఇండియన్ నేవీలో (Indian Navy)ఉద్యోగం సాధించడం ద్వారా తను కన్న కలను నెరవేర్చుకున్నారు.2024 సంవత్సరం జులై నెలలో సీబీటీ పరీక్షలో శ్రీనిధి అర్హత సాధించారు.తాజాగా విడుదలైన నేవీ ఫలితాల్లో ఆమె జీడీ ఎస్.ఎస్.ఆర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

ఎంతో కష్టపడి ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధించిన శీనిధి దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో నేవీ ఉద్యోగం సాధించానని అన్నారు.మాది చాలా సాధారణ కుటుంబం అని ఏదైనా సాధిస్తే మాత్రమే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.లక్ష్యం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ సాధన చేయాలని శ్రీనిధి తెలిపారు.
శ్రీనిధి టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన శ్రీనిధిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.







