కేరళ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.ఈ ఘటనతో ముఖ్యమంత్రి కాన్వాయ్( CM Convey) లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మహిళ స్కూటర్‌పై వెళుతుండగా.రోడ్డుపైకి ఒకవైపు మళ్లింది.
అయితే అదే సమయానికి ఆమె వెనుక నుంచి వేగంగా కేఎం కాన్వాయ్ వెళుతోంది.ఆ మహిళా రోడ్డు పక్కకు మళ్లడంతో ఒక్కసారిగా కార్లకు బ్రేక్ పడ్డాయి.
దీంతో వెనుక ఉన్న కార్లు అదుపు తప్పి ప్రమాదం సంభవించింది.ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్(CCTV cameras Recorded) కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని వామనపురం పార్క్ జంక్షన్(Vamanapuram Park Junction) వద్ద సోమవారం సాయంత్రం 5:44 గంటలకు ఈ ప్రమాద ఘటన జరిగింది.ఎంసీ రోడ్డు నుంచి అట్టింగల్‌కు వైపు వెళ్తున్న ఓ మహిళ నడిరోడ్డుపై స్కూటీ ఇండికేటర్ వేసి కొద్దీ సేపు వేచి ఉంది.ఎదురుగా కార్లు రావడంతో అవి వెళ్లే వరకు ఆమె రోడ్డుపైనే ఆగింది.
అలా కొద్దిసేపటికి రోడ్డు దాటేందుకు అవకాశం రావడంతో ఆ మహిళ స్కూటర్ మల్లయించింది.దాంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ పడ్డాయి.
దీంతో కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదాని తర్వాత ఒకటిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ఘటనలో అంబులెన్స్ కూడా ఉండడం గమనార్హం.

ప్రమాదం జరిగిన సమయంలో సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan)కాన్వాయ్‌లో ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు.ఘటన జరిగిన వెంటనే సీఎం కాన్వాయ్ లోని సెక్యూరిటీ గార్డు వచ్చి పరిస్థితిని తనిఖీ చేశారు.అనంతరం కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి నిలిపివేసి, ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించిన తర్వాత.అక్కడి నుంచి సీఎం కాన్వాయ్ బయలుదేరింది.అయితే, కాన్వాయ్ రోడ్డు దాటి రోడ్డుకు కుడివైపునకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది.







