స్టార్ హీరో ప్రభాస్(Prabhas ) మంచితనం గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు.ప్రభాస్ గురువు పేరు సత్యానంద్ అనే సంగతి తెలిసిందే.
సత్యానంద్ కొడుకు రాఘవ ( Raghava )ప్రభాస్ మంచితనం గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ నాన్నగారికి 35 లక్షల రూపాయల ఖరీదైన రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారని రాఘవ చెప్పుకొచ్చారు.

నేను ఆ వాచ్ ను ఒకటి రెండుసార్లు చూశానని ఆయన తెలిపారు.మా నాన్న ఆ వాచ్ ను భద్రంగా దాచుకున్నారని రాఘవ చెప్పుకొచ్చారు.ప్రభాస్ నాన్న దగ్గర నాలుగు నుంచి ఐదు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారని ప్రభాస్ నాన్న ఫ్రెండ్లీగా ఉంటారని ఎవరైనా చూస్తే కుళ్లుకుంటారేమో అనే స్థాయిలో నాన్న, ప్రభాస్ మధ్య్ అనుబంధం ఉందని రాఘవ తెలిపారు.ప్రభాస్ క్రమశిక్షణ అంటే నాన్నకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు.
ప్రభాస్ మంచి ఫుడీ అని ఫిట్ నెస్ కు కూడా ప్రభాస్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు.రాఘవ చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ షూట్ లో పాల్గొంటుండగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

ది రాజాసాబ్ సినిమా( The RajaSaab )లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కమర్షియల్ రేంజ్ గురించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.ప్రభాస్ స్క్రిప్ట్స్ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాల కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు.
ప్రభాస్ తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







