బిగ్ బాస్: అసలు రంగు బయటపెట్టిన విష్ణుప్రియ… అభిమానులకు కూడా చిరాకు తెప్పించిందిగా?

విష్ణుప్రియ( Vishnu Priya ) గురించి తెలుగు కుర్రకారుకి బాగా తెలిసిందే.మొదట యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు కాలక్రమంలో యాంకరింగ్ ఫీల్డుని వదిలేసి, ప్రైవేట్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టింది.

 Vishnu Priya Revealed Facts About Bigg Boss , Bigg Boss Nomination ,prithvi ,-TeluguStop.com

ఆ పాటలు ఆమెకి చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు.అందులో ముఖ్యంగా ‘జరీ జరీ చీరేకట్టి’ పాటలోని ఈ ముద్దుగుమ్మ చూపించిన అందాలకు యావత్ తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయింది.

దాంతో కట్ చేస్తే, ఆమెకి బిగ్‌బాస్ హౌస్ లో పాల్గొనే అవకాశం దక్కింది.అయితే విష్ణుప్రియ పాపులారిటీని అంచనా వేయడంలో ఇపుడు బిగ్ బాస్ తప్పుటడుగు వేసాడని నిర్వాహకులు ఫీల్ అవుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

Telugu Bigg Boss, Biggboss, Gautham Krishna, Nagarjuna, Prithvi, Tollywood-Movie

విషయం ఏమిటంటే, ఆమెకి ఖచ్చితంగా విజేత అయ్యే లక్షణాలు ఉన్నాయని బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడట. నాగార్జు( Nagarjuna )న కూడా కళ్లుమూసుకుని బిగ్‌బాస్ టీమ్ చెప్పింది నమ్మి ఆమెను విపరీతంగా అభిమానించాడు అని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.అయితే ఆమె ఫెయిర్, డొల్ల, భోళాతనంతో తన పరువు తానే తీసుకుంటోందని వినికిడి.నాది పీత బ్రెయిన్ సార్ అంటూ విష్ణుప్రియ తన గురించి తానే పరువు తీసుకుంటాడని అభిమానులు ఫీల్ అవుతున్న పరిస్థితి.

బిగ్ బాస్ గేమ్ లో భాగంగా పృథ్వితో లవ్ నటిస్తోంది గానీ ఆమె టెంపర్‌మెంట్‌కు పృథ్వి ఆఫ్టరాల్ అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.గతంలో బిగ్‌బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా… ఒక చెత్త గేమ్ ఆడేది ఈసారి ఎవరంటే? అది ఖచ్చితంగా విష్ణుప్రియ మాత్రమే అని మరోవైపు విశ్లేషకులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

Telugu Bigg Boss, Biggboss, Gautham Krishna, Nagarjuna, Prithvi, Tollywood-Movie

ఇక ఆమె తాజాగా ఐదుగురిని ఒకేసారి నామినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.అందులో ఫస్ట్ గౌతమ్ కృష్ణ.ఐతే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, అదే గౌతమ్ ఆమె మెగా చీఫ్ కావడానికి ప్రధాన కారకుడు కావడం.మరి తనను నామినేట్ చేయడంలో విష్ణుప్రియ స్ట్రాటజీ ఏముంది? అంటూ జనాలు బుర్రలు పట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఏ క్లాన్ అయితే నిన్ను మెగా చీఫ్‌ను చేసిందో, అదే క్లాన్ సభ్యుల్ని ప్రొటెక్ట్ చేయకుండా వాళ్లనే నామినేట్ చేయడం చాలా వింతగా ఉంది? అని నబీల్ ( Nabeel )నిలదీస్తే తెల్లమొహం వేసింది విష్ణుప్రియ.ఇక కడకు విష్ణుప్రియ వేసిన పనికిమాలిన లెక్కలన్నీ మటాష్ అయిపోయాయి.

త్వరలో విష్ణుప్రియ ఎలిమినేటి అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube