సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి2( Baahubali 2 ) కలెక్షన్ల రికార్డును ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం సులువు కాదనే సంగతి తెలిసిందే.రిలీజ్ సమయంలో ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఒక ఇండియన్ సినిమాను 10 కోట్ల మంది చూడటం అంటే న భూతో న భవిష్యత్ రికార్డ్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఆర్.
ఆర్.ఆర్, కేజీఎఫ్2 సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించినా ఈ సినిమాల టికెట్లు 5 కోట్లు కూడా అమ్ముడవలేదు.భారతీయ సినిమా చరిత్రలో ఎక్కువ టికెట్లు అమ్ముడై రికార్డును సొంతం చేసుకున్న సినిమా షోలే కాగా ఆ రికార్డ్ బ్రేక్ కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమా సంవత్సరాల తరబడి ఆడటం వల్లే ఈ రికార్డును సొంతం చేసుకుంది.
ప్రభాస్ తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు ఆ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డుగా క్రియేట్ చేయడం గమనార్హం.బాహుబలి2 సినిమా కథ, కథనంలోని ట్విస్టులు ఆ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.బాహుబలి2 సినిమా సృష్టించిన సంచలనాలు ఈరోజుకు కూడా చాలామంది థియేటర్ల ఓనర్లు మరిచిపోలేరు.
రాజమౌళి( Rajamouli ) తన సినిమాతో క్రియేట్ చేసిన రికార్డును రాజమౌళి బ్రేక్ చేస్తాడో లేక మరో డైరెక్టర్ బ్రేక్ చేస్తాడో చూడాల్సి ఉంది.బాహుబలి2 ప్రభాస్ అభిమానులకు సైతం స్పెషల్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.మహేష్ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించిన జక్కన్న ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ సినిమాలు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.