నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని డిఈఓ ఆఫీస్ చౌరస్తా వద్ద అడ్డా కూలీల మధ్య చెలరేగిన ఘర్షణ చిలికి చిలికి గాలి వానలాగా మారి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.స్థానికులు తెలిపిన వివరాలప్రకారం ఆదివారం ఉదయం రోజూలాగే డిఈఓ ఆఫీస్ చౌరస్తా వద్దకు లోకల్ అడ్డా కూలీలు,బీహార్ కూలీలు చేరుకున్నారు.
వీరి మధ్య పనుల విషయంలో మాట మాట పెరిగి వాగ్వాదం ముదిరి మధ్య ఘర్షణకు తలెత్తింది.దీనితో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు.
ఇరు వర్గాల రాళ్ళ దాడిలో అటుగా వెళ్తున్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.సుమారు 15 నిమిషాల పాటు జరిగిన గొడవతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
తర్వాత రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.దాడికి కారణమైన వారిపై ఆరా తీసి, కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.