ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్

జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్( Free Summer Coaching Hockey Camp ) ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయకుమార్ తెలిపారు.సోమవారం ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరై క్రీడాకారులకు హాకీ స్టిక్స్,బాల్స్ మరియు క్రీడ సామాగ్రిని అందజేశారు.

 Free Summer Coaching Hockey Camp,nalgonda Hockey Association,nalgonda,summer Coa-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ హాకీ అసోసియేషన్( Nalgonda Hocky Association ) అద్భుతంగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు.నల్లగొండ తరపున గత క్రీడా సంవత్సరంలో 18 మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో పాల్గొన్నారని చెప్పారు.

అనంతరం నల్లగొండ హకీ అసోసియేషన్ అధ్యక్షుడు కూతురు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.నల్లగొండ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం మాట్లాడుతూ జిల్లాకు రెండు కిలో ఇండియా సెంటర్లు రావడం జిల్లా అదృష్టమన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ హాకీ అసోసియేషన్ చైర్మన్ కూతురు లక్ష్మారెడ్డి,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసచారి,ఫరూక్,యావర్, అజిత్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube