నల్లగొండ జిల్లా: ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని, ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాననిప్రణయ్ భార్య అమృత అన్నారు.ప్రణయ్ హత్య కేసులో శిక్షలు పడ్డాక ఆమె స్పందించారు.
ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను మీడియా ముందుకు రావట్లేదని క్లారిటీ ఇచ్చారు.
దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండని కోరారు.







