సూర్యాపేట జిల్లా:అక్రమ లేఅవుట్ ప్లాట్లు కొనుగోలు చేసినవారికి అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసినా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అనుమతులు మంజూరు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.హుజూర్ నగర్ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ గత నాలుగు ఏళ్లుగా ఇక్కడే ఉంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు,మున్సిపల్ ఉద్యోగులు కూడా వీరితో కుమ్మక్కై హుజూర్ నగర్ పట్టణ,పరిసర ప్రాంతాలో అక్రమ లై అవుట్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగడానికి దోహద పడుతున్నట్లు సమాచారం.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు మ్యాప్ పాయింటింగ్ తో అడ్డదారిలో అనుమతులు పొందడం వల్ల రహదారుల వెడల్పు తగ్గి రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాపోతున్నారు.