కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు..: కేసీఆర్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ బాస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

 There Is No Situation For Congress To Win..: Kcr-TeluguStop.com

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయొద్దని ప్రజలకు సూచించారు.ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్న ఆయన ఓటు మన తలరాతను మారుస్తుందన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టాల్సిన ప్రాంతంలో కట్టలేదని చెప్పారు.తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని మండిపడ్డారు.

దళితబిడ్డలు తరతరాలుగా వివక్షకు గురవుతున్నారన్న కేసీఆర్ తెలంగాణ కోసం పేగులు తెగేదాకా పోరాడామని చెప్పారు.కరెంట్, నీళ్ల కోసం కాంగ్రెస్ ఏనాడూ పోరాడలేదని తెలిపారు.

కాంగ్రెస్ డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారన్నారు.అయితే అసలు కాంగ్రెస్సే గెలిచే పరిస్థితి లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube