సూర్యాపేట జిల్లా: మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు, పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.అనంతరం కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడంలేదన్నారు.60 శాతానికి పైగా ఉన్న బీసీలను కాదని, జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల వారికే పార్టీ స్థానం కల్పిస్తుందని,
ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి ఆ స్థాయిలో అవకాశాలు కల్పించడంలేదన్నారు.ఇతర పార్టీలు బీసీలను గుర్తించి ఎమ్మెల్యే,ఎంపిల సీట్లను ఇస్తుంటే కాంగ్రెస్ లో కేవలం రెడ్డీలు రాజ్యమేలుతున్నారని, దీనిని గమనించి మూడవ విడత అభ్యర్థుల ఎంపికలో బీసీ సీనియర్ నాయకులకు టిక్కెట్లను కేటాయించాలన్నారు.
బీసీలకు పార్టీలో సముచిత స్థానం కల్పించకపోతే రెబల్ గానైన పోటీ చేస్తానని ప్రకటించారు.