సూర్యాపేట జిల్లా:ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంఘాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ఉపాధ్యాయ,అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు.శనివారం సూర్యాపేటకు వచ్చిన ఆయనకు బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ,అధ్యాపకుల సమస్యలను తీర్చే బాధ్యత నాదన్నారు.గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయని,వారికి నెల నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని,
వారికి నెల నెలా జీతాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు.
బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ సంఘాలు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్రాజ్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.భవిష్యత్లో బీసీలు రాజ్యాధికారం రావాలన్నా బీసీలు చైతన్యమై ఏకమవ్వాలన్నారు.
శాసన మండలిలో బీసీ గొంతు వినపడాలంటే బీసీలకు ఓటు వేసి చట్టసభలకు పంపాలని కోరారు.ఈ సమావేశంలో నాయకులు తూము వెంకన్న,బయ్య మల్లికార్జున్,మన్నెం యాదగిరి,మాచనపల్లి లింగయ్య,వజ్జె వీరయ్య, బడుగుల శ్రీనివాసయాదవ్.
మన్నెం మురళి, లింగస్వామి,నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.