సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళనకు దిగారు.ట్రేడర్స్ క్వింటా రూ.1200 ఇవ్వడంతో మార్కెట్లో రైతులు భగ్గుమన్నారు.ట్రేడర్స్ పై తిరగబడి,కాంటా మిషన్లను ధ్వంసం చేశారు.
ధాన్యం కొనుగోలుకు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.దీనితో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.