పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యింది.ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం అయ్యింది.
మూడు నాలుగు నెలలుగా సినిమా షూటింగ్ అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.ఎట్టకేలకు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు షూటింగ్ ను మొదలు పెట్టారు.
మొఘలాయిల కాలం నాటి దొంగ పాత్రలో ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా లో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఎట్టకేలకు పునః ప్రారంభం అయ్యాయి కనుక వెంటనే సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.
నేడు సాయంత్రం సర్ ప్రైజ్ ను ఇస్తున్నామని అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో వైపు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నాడు.ఈ రెండు సినిమా లు కూడా సమాంతరంగా షూటింగ్ జరుగుతాయని అంటున్నారు.
ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ చాలా విభిన్నంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
భారీ ఎత్తున సినిమా ను ఈ సినిమా ను ఏఎం రత్నం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సినిమా గ్రాఫికల్ వర్క్ కు ఏకంగా నాలుగు నెలల సమయం పడుతుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ను మొదటి సారి పీరియాడికల్ డ్రామాలో చూడబోతున్నందుకు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.







