నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి ‘వర్షంలో వెన్నెల‘ పాట విడుదల చేసిన సమంతయంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి‘ మ్యూజికల్ జర్నీ గ్రాండ్ గా మొదలైయింది.ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ని సౌత్ క్వీన్ సమంత విడుదల చేశారు.
em>మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులని అలరిస్తుంది.ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.
పాటని కూల్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.
హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలో విజువల్స్ చాలా లావిష్ గా వున్నాయి.
శ్రీమణి అందించిన సాహిత్యం కూడా వర్షంలో వెన్నెలంతా హాయిగా వుంది.పాట ఇంటర్ల్యుడ్ లో వినిపించిన వీణ స్కోర్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది.
పాట పాడిన సంజన కల్మంజే, ఆదిత్య ఆర్కే ఇద్దరూ తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.ఈ పాటతో ‘కృష్ణ వ్రింద విహారి’ సంగీత ప్రయాణం గ్రాండ్ గా ప్రారంభమైయింది.
డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి m>నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు.ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.తాజాగా విడుదలైన ‘వర్షంలో వెన్నెల’ పాట సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.
తారాగణం:
నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్.కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్, సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: బుజ్జి, ఎడిటర్ – తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ – రామ్ కుమార్, డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్, పీఆర్వో: వంశీ, శేఖర్
.






