అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్ పై సొంత పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి ఎవరు వెళ్లొద్దని మండల పార్టీ అధ్యక్షుడు సోషల్ మీడియాలో వీడియోను పంపడాన్ని ఆ పార్టీ శ్రేణులు,గ్రామ శాఖ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార బలంతో అసభ్య పదజాలంతో మాట్లాడితే ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఖండించాల్సింది పోయి,ఏ నాయకుడు,కార్యకర్త వెళ్ళొద్దని చెప్పడం వెనక ఉన్న అంతర్యం ఏంటని ప్రశ్నించారు.నిరసన కార్యక్రమానికి వెళ్లినవారు చెత్త నా కొడుకులని మాట్లాడిన మండల పార్టీ అధ్యక్షుడిపై నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరును పార్టీ శ్రేణులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇలాంటి మండల పార్టీ అధ్యక్షుడు ఉంటే ఉత్సాహంగా పనిచేయలేమని,ఇప్పటికే ఇతని వల్ల చాలామంది పార్టీ మారారని ఆరోపించారుపోలేబోయిన లింగయ్య యాదవ్ కు మండల అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని పార్టీ శ్రేణులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
త్వరలోనే మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకొని,అందరి నిర్ణయం మేరకు నూతన అధ్యక్షుడి తోపాటు పూర్తి మండల కమిటీని ఎన్నుకుంటామన్నారు.నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన లింగయ్య యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు,సర్పంచ్లు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు,మాజీ ఎంపిటిసిలు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.