నల్లగొండ జిల్లా:జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం(డీఆర్డీఏ)( District Rural Development Authority )లోకాసులకు కక్కుర్తిపడి, అక్రమ డిప్యూటేషన్స్, బదిలీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని,ప్రతి బదిలీకి, డిప్యూటేషన్ కీ ఒక రేటు నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.తిప్పర్తి మండలంలో పనిచేసే టిఏ ఆరోగ్యం బాగాలేదని, డిప్యూటేషన్ కావాలని ఎంత బతిమిలాడినా, ఆఖరికి మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించినా ఆమెకు న్యాయం జరగలేదు.
కానీ, కార్యాలయంలో ముడుపులు ముడితేనే ఏ పనైనా సులువుగా జరుగుతుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు.నాంపల్లి మండలంలో పనిచేసే ఈసీకి టెక్నికల్ డిఆర్పీగా, అనుముల మండలంలో పనిచేసే ఈసీకి జియాలజిస్ట్ గా,కట్టంగూర్ మండలంలో పనిచేసే ఈసీకి వాటర్ షెడ్ విభాగం చేయగా,గుర్రంపోడ్ మండలంలో పనిచేసే ఏపీఓకి ప్లాంటేషన్ విభాగంలో జిల్లా కార్యాలయంలో ఉండేలా పోస్టింగ్ లు ఇచ్చారని, కానీ,వీరిలో ఏ ఒక్కరు కూడా జిల్లా కేంద్రంలో కనిపించడం లేదని, క్షేత్రస్థాయిలో విధులకు వెళ్లరని తెలుస్తుంది.
వాస్తవంగా గుర్రంపోడ్ మండలంలో ఏపీవో అనవసరం చాలా ఉంది.అక్కడ 100 తోటల వరకు సాగులో ఉంటాయి.
కానీ, అక్కడున్న అధికారికి అవేవీ పట్టించుకోడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి ఒక ఉద్యోగిని తమ పని చేసే చోట నుంచి మరో అవసరమైన చోటికి బదిలీ చేయడం సహజం.
బదిలీ చేయడానికి అవకాశం లేనప్పుడు డిప్యూటేషన్ పేరుతో ఇతర ప్రాంతాలకు పంపిస్తారు.అలాగే డిఆర్డిఏ లో డిప్యూటేషన్ అవసరం పేరుతో వేరే ప్రాంతానికి కొంతమంది అధికారులను పంపించారు.
కానీ,వాళ్లు ఎక్కడ పని చేస్తున్నారు? వాళ్ళ టూర్ డైరీ లాంటివి ఎలా బయటికి తీయనీయకుండా గోప్యంగా ఉంచుతూ అదనంగా జీతాలు అందజేస్తున్నారు.అందులో ముఖ్యంగా అబెధ్ అబ్దుల్,రఘువీర్లు సుమారు పదేళ్లుగా డిప్యూటేషన్ పేరుతో హైదరాబాద్ టీఎస్ ఐపాడ్ లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నట్టు సమాచారం.
కానీ, అందులో ఎంతవరకు వాస్తవముందో ఎవరూ నోరు విప్పరు.ఇది కాకుండా వాళ్లకు అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్ టూర్ డైరీ ఇలాంటివి ఏదీ ఉండదని,కేవలం అక్కడ పనిచేసినట్లు డ్యూటీ సర్టిఫికెట్ పెట్టి నల్లగొండలో వేతనం తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా రిసోర్స్ పర్సన్ ఫీజు తీసుకోకుండా పనిచేయాలి కానీ,వీళ్లు మాత్రం నల్లగొండ కార్యాలయం నుంచి మరోవైపు రిసోర్స్ పర్సన్ గా రెండు వైపులా సంపాదిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై ప్రశ్నిస్తే గోప్యంగా ఉంటూ వీళ్ళ సమాచారం బయటకు రాకుండా చూస్తున్నట్లు వినికిడి.వీరితో పాటు నాంపల్లిలో పనిచేసే తుల్జా,అనుములలో పనిచేసే నాగరాజు, కట్టంగూర్ లో పనిచేసే లాయక్ అలీలు డ్యూటీకి వెళ్లకుండా డిఆర్డిఏ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టుగా అక్రమ డిప్యూటేషన్ పొంది అక్కడ పని చేస్తున్నట్టు డ్యూటీ సర్టిఫికెట్ వాళ్ల రెగ్యులర్ మండలాలకు పంపి జీతం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
కానీ,వీళ్ళ పేరు మాత్రమే జిల్లా కార్యాలయంలో,డిప్యూటేషన్ లో ఏ రోజు కూడా ఆఫీసులో పనిచేసింది లేదు,పట్టుమని పది నిమిషాలు కూర్చునేది లేదు.అక్కడ నుంచి అక్రమ సంపాదన వస్తుందా.
దాన్ని ఎట్లా జేబులో వేసుకోవాలా అనే పనిలోనే వీరంతా నిమగ్నమై ఉంటారని విమర్శలు ఉన్నాయి.
జిల్లాలోని చాలా మండలాలలో ఈసీలు లేక ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చి అదనపు పనిభారం మోపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అందులో కొన్ని అనుముల,త్రిపురారం, నాంపల్లి,మునుగోడు, గుర్రంపోడ్( Gurrampode ),నేరేడుగొమ్ము మండలాలలో పనిచేస్తున్న టిఏలు మరోపక్క ఈసీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.డీఆర్డీఏలో ఏపీఒ,ఈసీ, సీఓ,టీఏ,ఎఫ్ఏ,కొన్ని క్లస్టర్లలో ఏపీడీలతో ఉద్యోగుల కొరత వుంది.
డీఆర్డీఏ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నా, ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నా ఉన్నతాధికారులకు పట్టింపు లేదు.ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకు లోకి ఐకెపి కమిషన్.
ఇప్పుడున్న పరిస్థితి ఏంటి…?అదేనా…మారిందా…! సర్వత్ర విమర్శలు ఒక సందర్బంలో వెల్లువెత్తాయి.డీఆర్డిఏ కార్యాలయంలో ఓ అధికారి 15 ఏళ్లుగా అక్కడే తిష్ట వేసి నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
అద్దె కార్ల దందా ప్రైవేట్ డ్రైవర్ల గోస అంతా ఇంతా కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు.