నల్లగొండ జిల్లా:ఈ నెల 17 నుండి జరిగే జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ హజరత్ లతీఫ్ షా ఖాద్రి(Hazrat Latif Shah Qadri Ursu ) ఉర్సు ఉత్సవాలను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని ఉర్స్ కమిటీ,మరియు ముతవల్లిలను నల్లగొండ ఇంచార్జ్ ఆర్డీఓ శ్రీదేవి ఆదేశించారు.జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ( District Collector Narayana Reddy )ఆదేశాలతో బుధవారం దర్గా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఉర్సు ఉత్సవాలకు పోలీస్, మున్సిపల్,రెవెన్యూ,వక్ఫ్ బోర్డ్ అన్ని శాఖల నుంచి అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారుల సలహాలు, సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని,భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం డిఎస్పీ కె.శివరాంరెడ్డి మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో గల పార్కింగ్ ఏరియాలను పరిశీలించి జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన కార్యక్రమాలు నిర్వహించినా ఉపేక్షించేది లేదని,వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్,వక్ఫ్ బోర్డ్ అధికారులు, నల్లగొండ వన్ టౌన్,టూ టౌన్ సిఐలు,ఎస్ఐలు, రెవెన్యూ అధికారులు, దర్గా ముతవల్లిలు సమీఖాద్రి,ఉబేద్ ఖాద్రి, సల్మాన్ ఖాద్రి,దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.