ఎయిడ్స్‌ నియంత్రణలో సాగర్ ఆసుపత్రికి దక్కిన అవార్డు

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఎయిడ్స్‌, ఎల్హెచ్‌ఐవీ నియంత్రణ,వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలను అందించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉమ్మడి జిల్లా ఉత్తమ అవార్డు లభించింది.ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ హరికృష్ణ,డిపిఎం సుధాకర్ చేతుల మీదుగా జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఐసిటిసి కౌన్సిలర్ మాలోత్ మంచు నాయక్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.

 Sagar Hospital Awarded For Aids Control , Sagar Hospital Awarded , Aids Control-TeluguStop.com

ఉత్తమ అవార్డు రావడంతో పాటు తానే అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని,ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని,ఉత్తమ సేవలందించడానికి కృషి చేస్తామన్నారు.ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు.హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష ప్రదర్శించకూడదని,వారిని మనలో ఒకరిగా చూడాలని చెప్పారు.

చికిత్స కంటే నివారణే ఎయిడ్స్‌కు ఏకైక మార్గమని.ఈ వ్యాధిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.

హెచ్‌ఐవీ బాధితుల ఆరోగ్యం కాపాడటం,కొత్తవారు వ్యాధి బారిన పడకుండా చూడటం మన లక్ష్యమన్నారు.బాధితుల జీవిత కాలాన్ని పెంచేందుక అవగాహన పెంపొందించాలని చెప్పారు.

వారు పౌష్టికాహారం,అవసరమైన మందులను తీసుకునేలా చూడాలని తెలిపారు.ఎయిడ్స్‌పై అవగాహన పరచడంలో స్వచ్ఛంద సంస్థలు కూడా మెరుగైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube