బీసీలకు టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాం

నల్లగొండ జిల్లా:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు.ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్&బి అతిథి గృహంలో బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

 Trs Party Will Be Defeated If Bcs Are Not Given Tickets-TeluguStop.com

ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం 1967వ సంవత్సరంలో ఏర్పడిందని,అప్పటి నుండి ఏపార్టీ కూడా బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవని,నియోజకవర్గంలో 70%పైగా బీసీల ఓట్లే ఉన్నాయని,కానీ రాజకీయ పార్టీలు మాత్రం బీసీలను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో బీసీల పాత్ర ఎంతగానో ఉన్నా కూడా బీసీల త్యాగాలను గుర్తించని అధికార టిఆర్ఎస్ పార్టీ,కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మునుగోడు ఉప ఎన్నికల్లోనైనా బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని,లేనిపక్షంలో బీసీల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనన్నారు.

ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ బీసీలకు ఓరగబెట్టిందేమీ లేదన్నారు.కులవృత్తుల ఆధారంగా జీవనోపాధి సాగిస్తున్న బీసీలకు ప్రత్యామ్నాయం చూపించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యరని,కుల వృత్తులు కుంటుపడటంతో బీసీల బ్రతుకులు రోడ్డు పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని,అలాగే నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.8 ఏళ్ల కెసిఆర్ పాలనలో బిసి,ఎంబిసి కార్పోరేషన్లకు పాలకమండల్లు నియమించడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.బీసీ సబ్ ప్లాన్ పై నోరు మెదపకపోవడం బీసీలకు అన్యాయం చేయడమేనని, బీసీ మంత్రిత్వ శాఖ కేవలం గురుకులాలకే పరిమితం చేయడం కెసిఆర్ కే చెల్లిందని,ప్రత్యేకంగా బీసీల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.మీ వివక్షతను గమనిస్తున్నామని, బీసీలు నిశ్శబ్ద విప్లవకారులని,సమయం వచ్చినప్పుడు మీపార్టీని బొంద పెట్టేందుకు కూడా వెనకాడమని, మునుగోడులో 70 శాతం బీసీలు ఉన్న సంగతిని కెసిఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు ఎలిజాల రమేష్,పట్టణ ఉపాధ్యక్షుడు కంబాలపల్లి అనిల్,బోళ్ల నాగరాజు,మధు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube