తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో( Anganwadi ) ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9,వేల అంగన్‌వాడీ టీచర్లు,హెల్పర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

 Notification For 9 Thousand Anganwadi Teachers And Helpers In Telangana...!, Ang-TeluguStop.com

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నారు.

గతంలో అంగన్‌వాడీ టీచర్ల( Anganwadi teachers ) పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉండేది.తాజా మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులతో పాటు హెల్పర్లుగా నియమితులైన వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

అదేవిధంగా, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాలు,65 సంవత్సరాలు దాటిన తర్వాత వారి సేవలను పొందకూడదు.విద్యార్హత మార్కులు,స్థానికత, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు,హెల్పర్ ఉంటారు.

గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం ద్వారా ఈ ఖాళీలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube