యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.హాస్టల్ వార్డెన్ శైలజకు ఆటో డ్రైవరుకు సంబంధం ఏమిటి?వారి విషయం తెలిసిపోవడంతో ఇద్దరు కలిసి భవ్య,వైష్ణవిలకు వేధించారా? మా మేడం శైలజ మంచిది.
ఆమెను ఒక్క మాట కూడా అనకండి అంటూ అనుమానపు రాతల సూసైడ్ లెటర్ ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.ఈ క్రమంలో ఆ ఇద్దరిని హత్య చేసి ఫేక్ సూసైడ్ లెటర్ సృష్టించారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈవిషయంలో వార్డెన్ శైలజ,ఆటో డ్రైవర్ ఆంజనేయులును పోలీసుల అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారని సమాచారం.