హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని సరంపేట నుంచి లెంకలపల్లికి వెళ్లే మార్గంలోని హరితహారం( Harithaharam) మొక్కలు సోమవారం అగ్నికి ఆహుతయ్యాయి.హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు కొందరు రైతులు,బాటసారుల, వాహనదారుల తప్పిదాలతో మొక్కలు మంటల్లో కాలిపోతున్నా సంబధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

 Harithaharam Plants Are A Kind Of Fire , Harithaharam, Marriguda, Farmers , Nal-TeluguStop.com

మొక్కల చుట్టూ ముళ్ల కంపలు,గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం,ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో,పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయని అంటున్నారు.

దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలని,వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube