తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ మంచి గుర్తింపును సాధించి కుంటూ ముందుకెళ్లారు అలాంటి వారిలో శోభన్ బాబు ఒకరు.ఒకానొక టైంలో సక్సెస్ ఫుల్ హీరోగా వెలిగిపోయిన శోభన్ బాబు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా మారిపోయారు.
ముఖ్యంగా చెప్పాలంటే శోభన్ బాబు కి లేడీస్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.శోభన్ బాబు ఒక మంచి నటుడు అని మనందరికీ తెలుసు అయితే శోభన్ బాబు వల్ల ఇబ్బందిపడ్డా ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం…
జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి అనే ప్రొడ్యూసర్ శోభన్ బాబు తో కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త అనే సినిమాని చేశారు.
ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఆ సినిమా తర్వాతే ఇంకో సినిమా కూడా శోభన్ బాబు తో ప్లాన్ చేసి చేశారు అది కోరుకున్న మొగుడు సినిమా, ఈ సినిమాకి సుబ్బారావు దర్శకుడు కాగా, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం శోభన్ బాబు తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి గారు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు అవి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ జరిగే ప్రాసెస్ లో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ ఉంది అది కన్నడ రాజ్ కుమార్ గారికి చెబుదాం అని బెంగళూరు వెళ్లి రాజ్ కుమార్ ను కలిసి ఆ కథ చెప్పడంతో రాజ్ కుమార్ వాళ్ళ భార్య కథ నాకు ఇచ్చేయండి అని అడిగింది.ఆమె అలా అడగడం నచ్చని సింగీతం శ్రీనివాసరావు సైలెంట్ గా అక్కడినుంచి వచ్చేసాడు ఆ తర్వాత కొన్ని రోజులకి అదే కథని మళ్ళీ రాధాకృష్ణ మూర్తి గారి దగ్గరికి తీసుకు వచ్చి ఈ సినిమాని మనం నాగేశ్వరరావు గారితో చేద్దాం అని చెప్పడంతో డైరెక్ట్ గా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పారు ఆయనకు నచ్చి ఆయన చేద్దాం అని చెప్పడంతో రాధాకృష్ణ మూర్తి గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
![Telugu Subba Rao, Faced Problems, Sobhan Babu-Telugu Stop Exclusive Top Stories Telugu Subba Rao, Faced Problems, Sobhan Babu-Telugu Stop Exclusive Top Stories]( https://telugustop.com/wp-content/uploads/2021/03/Producer-Jagarlamudi-radha-krishna-faced-problems-with-the-sobhan-babu.jpg)
అయితే రాధాకృష్ణ గారు నాగేశ్వరరావు గారితో మీరు నాకు సినిమా కమిట్ అయినట్టు ఎక్కడ చెప్పకండి అని చెప్పాడు సరే అని ఆయన కూడా ఎవరితో చెప్పను అన్నాడు.ప్రేమాభిషేకం 100 రోజుల ఫంక్షన్ లో భాగంగా నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి కొందరు మీడియా మిత్రులు అడిగితే తన తర్వాత సినిమా రాధా కృష్ణ గారితో ఉంటుంది అని చెప్పడంతో వాళ్లు పేపర్లో ప్రింట్ చేశారు అది తెలుసుకున్న శోభన్ బాబు కోరుకున్న మొగుడు క్లైమాక్స్ షూటింగ్ లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ అయిన రాధాకృష్ణ గారిని పిలిపించి నువ్వు నాగేశ్వరరావు గారితో సినిమా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగాడు దాంతో ఆయన అది ఇప్పుడు కాదు ఇంకొక ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు.దాంతో శోభన్ బాబు నువ్వు నా సొంత తమ్ముడివి అనుకున్న ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ అనుకున్న బయట వాళ్ళ తో ఎందుకు సినిమాలు చేస్తున్నావ్ అని అడిగాడు దానికి రాధాకృష్ణ గారు దీంట్లో తప్పేముంది సార్ మీ హీరోలు నలుగురు ప్రొడ్యూసర్ లతో సినిమాలు చేస్తున్నారు, మా ప్రొడ్యూసర్లు నలుగురు హీరోలతో సినిమా చేస్తే తప్ప సార్ అని అడిగినందుకు శోభన్ బాబు గారు చాలా హర్ట్ అయ్యారు దాంతో కోరుకున్న మొగుడు సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెప్పకుండా చాలా రోజుల పాటు రాధాకృష్ణని ఆయన చుట్టూ తిప్పుకున్నాడు.దీనికంటే వెనక స్టార్ చేసిన శోభన్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు దాంతో గట్టిగా రాధాకృష్ణ గారు శోభన్ బాబు ని అడిగాడు మొత్తానికి డబ్బింగ్ చెప్పి సినిమాని ఫినిష్ చేశారు.
అయితే ఈ విషయం పైన ప్రొడ్యూసర్ అయిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి గారు ఈమధ్య స్పందిస్తూ అప్పట్లో శోభన్ బాబు గారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి గారు నాగేశ్వరరావు,జయసుధ నటించిన ప్రతిబింబాలు సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.