వేపచెట్లను కాపాడండి

నల్లగొండ జిల్లా: డ్రై బ్యాక్ వ్యాధితో ఎండిపోతున్న వేపచెట్లను బతికించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులు డాక్టర్ యరమాద కృష్ణారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎండిపోతున్న వేపచెట్లను కాపాడాలని,ఉపాధి హామీ పథకం ద్వారా ఇందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

 Protect Neem Trees-TeluguStop.com

వ్యాధితో చనిపోతున్న చెట్ల నుండి రాలిన ఆకులను కాల్చి,చెట్ల చుట్టూ పాదుచేసి నీటిని అందించాలన్నారు.అదే విధంగా అటవీ, ఉద్యాన,వ్యవసాయ,ఎంపీడీఓ,ఈటీసీ అధికారుల పర్యవేక్షణలో ఫెస్టిసైడ్స్ వాడాలన్నారు.

కొత్త మొక్కలు పెట్టడానికి ప్రతి గ్రామ పంచాయతీ పాలకులు, అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు.డ్రై బ్యాక్ వ్యాధిని అరికట్టకపోతే అన్ని రకాల చెట్లు ఎండిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు.

ఈమేరకు అన్ని రకాల సంఘాల నాయకులు,సామాజిక కార్యకర్తలు అధికారులకు వినతిపత్రం అందించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube