నకిలీ రసాయనిక హెన్నా కోన్స్ డేంజర్...

నల్లగొండ జిల్లా:గోరింటాకు పెట్టుకోటం అంటే ఆడవారికి చాలా ఇష్టం.గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు.

 Fake Chemical Henna Cones Danger Chemical Henna Cones, Danger , Chemical , Mehd-TeluguStop.com

మరీ ముఖ్యంగా అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా, అందంగా కనిపిస్తున్నారు.అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు టెన్షన్ తగ్గించ టంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి,జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్పే మాట.అయితే ఈ మధ్య చాలా మంది సహజసిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరింటాకు బదులు హెన్నా మెహందీ పెట్టుకుంటున్నారు.అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగాచేతులతో పాటు,తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.హైదరాబాద్ మెహిదీపట్నం( Mehdipatnam )లోని ఓ యూనిట్‌ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు.

అక్కడ నుంచి పెద్దఎత్తున హెన్నా ఉత్ప త్తులను స్వాధీనం చేసు కున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్‌ యాసిడ్‌ అనే విషపూరిత రసాయ నాన్ని ఉపయోగించి వారు ఈ హెన్నాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

మెహిదీపట్నంలోని షకిల్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి ‘స్పెషల్‌ కరాచీ మెహందీ కోన్‌’ పేరుతో హోల్‌సేల్‌లో విక్రయిస్తున్నారు.పిక్రామిక్‌ యాసిడ్‌ అనే సింథటిక్‌ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జుట్టు ఊడిపోవటం, చేతులు పొడిబారటం వంటివి జరుగుతాయన్నారు.హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అక్కడ అధికారులు తీగలాగితే చివరికి మెహిదీపట్నంలో డొంక కదిలింది.

షకీల్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ అలీ దీనికి ప్రధాన సూత్రదారి అని గుర్తించి అతని వద్ద నుంచి భారీ హెన్నా స్టాకును స్వాధీనం చేసుకొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube